Thursday, November 19, 2015

ఓ పెరుగు కథ !!


సమయం: ఎప్పుడో (& ఎప్పుడూ)
స్థలం: ఇంట్లో

అమ్మ: పెరుగు
నేను: నాక్కూడా ఇంకో నాలుగు ఇంచీలు పెరగాలనే ఉంది. కానీ ఇంకా పెరుగుతానంటావా ..!
అమ్మ: తింగరి మాటలాపి... పెరుగేసుకో
నేను: యక్...వద్దు
అమ్మ: పెరుగన్నం తిని నాలుగు రోజులైంది. మళ్ళీ కాలు నొప్పి వేలు నొప్పి అని నసిగావంటే వాత పెడతా
నేను: కళ్ళు, ముక్కు మూసుకుని... చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఊరిలో తిన్న గడ్డ పెరుగు తలుచుకుంటూ... ఎలాగో నాలుగు ముద్దలు మింగేసి నోరు కడుక్కున్నా

***

సమయం: ఆ మధ్య
స్థలం: అబుదాబిలో , ఫ్రెండ్ ఇంట్లో

అది (= ఫ్రెండ్): పెరుగు
నేను: నాక్కూడా ఇంకో...
అది: ఈ కుళ్ళు జోకు పదేళ్ళ నుండి వింటున్నాగాని... మూసుకుని పెరుగేసుకో
నేను: ఎహే వద్దు
అది + వాళ్ళాయన: ఇక్కడ పెరుగు అద్భుతంగా ఉంటుంది... ఒకసారి తిని చూడు. నచ్చకపోతే వదిలేయ్
నేను: (అయిష్టంగా టేస్ట్ చుసి... కళ్ళు, ముక్కు మూసుకునే పనిలేదని గ్రహించి...) బాగుందే ... !

...

రోజూ మానకుండా మాట్లాడకుండా పెరుగేసుకోటం చూసి... ఫ్రిజ్ లో పెరుగు అయిపోకుండా స్టాక్ మెయింటెయిన్ చేస్తున్న వాళ్ళ ఆయన గురించి...
నేను: (పెరుగన్నం తింటూ) మీ ఆయన దేవుడబ్బా
అది: డబ్బా లేదు గిబ్బా లేదూ... కావాలంటే ఇంకాస్త పెరుగేసుకో... అంతే కానీ అలా __లు మాట్లాడకు
నేను: (ప్లేట్ లో అయిపోయిన పెరుగన్నం నాకుతూ) హి హి హి

***

సమయం: ఈ మధ్య (& ప్రతి రోజూ)
స్థలం: ఇంట్లో

అమ్మ: పెరుగు
నేను: నాక్కూడా ఇంకో ...
అమ్మ: సోదాపి పెరుగేసుకో
నేను: కళ్ళు, ముక్కు మూసుకుని...